![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -499 లో......నర్మద, ప్రేమ కలిసి నీకు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ప్రిపేర్ చేశామని వల్లితో చెప్పి పెద్ద ప్లేట్ లో ఫుడ్ తీసుకొని వస్తారు. దానిపై ఒక క్లాత్ కప్పుతారు. అది చూసి నా కోసం ఏదో గట్టిగానే తెచ్చినట్లున్నారని వల్లి మురిసిపోతుంది. తీర ఆ క్లాత్ తీసేసరికి అందులో అన్ని పచ్చి కూరగాయలు కట్ చేసి ఉంటాయి. అవి చూసి వల్లి షాక్ అవుతుంది. ఇవే తినాలి అక్క నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావ్ కదా అని నర్మద అంటుంది.
అయినా నేను తిననని వల్లి అంటుంది. దాంతో నర్మద, ప్రేమ కలిసి తనకి బలవంతంగా తినిపిస్తారు. దాంతో నాకు కడుపు లేదని గట్టిగా అరుస్తుంది. అది విని వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇవన్నీ తినిపిస్తే నాకు కడుపు ఉంటుందా అని అంటున్నానని కవర్ చేస్తుంది వల్లి. ఆ తర్వాత సేనాపతిని ధీరజ్ తన కార్ లో ఎక్కించుకొని వస్తాడు. అలా రావడం ప్రేమ, వేదవతి చూస్తారు. సేనాపతి చేతికి కట్టు కూడా ఉంటుంది. సేనాపతి కార్ దిగి లోపలికి వెళ్తాడు. ఏమైంది మా నాన్నకి అని ప్రేమ, అలాగే వేదవతి కూడా అడుగుతుంది. దాంతో ధీరజ్ జరిగింది చెప్తాడు. ధీరజ్ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తాడు. సేనాపతి తనని ఏమైనా అంటాడేమోనన్న భయంతో కార్ పక్కన నుంచి వెళ్లి పడిపోతాడు. అది చెప్పగానే నీ వల్లే మా నాన్నకి గాయం అయిందని ప్రేమ అంటుంది. నా వల్ల కాదే నీ వల్లే ప్రొద్దున నువ్వే ఎదురు వచ్చావ్.. నాకు మంచి జరిగింది.. పాపం మీ నాన్నకే అలా జరిగిందని ధీరజ్ నవ్వుతాడు.
ఆ తర్వాత సేనాపతికి ఉన్న గాయం చూసి ఏమైందని భద్రవతి అడుగుతుంది. దాంతో జరిగింది చెప్తాడు సేనాపతి. ఇన్ని రోజులు మీరు పగ తీర్చుకున్నారు. ఇక వాళ్ళు తీర్చుకుంటారని పెద్దావిడ అంటుంది. మరొకవైపు నర్మద వర్క్ చేసే దగ్గర తన ఫ్రెండ్ ఫోన్ లో ఒక సీక్రెట్ మిషిన్ చూస్తుంది. ఏంటి అది అని నర్మద అడుగుతుంది. మా ఆయన అబద్ధం చెప్తున్నాడనిపిస్తుంది.ఈ మిషిన్ ద్వారా అతను చెప్పేది అబద్ధమో నిజమో తెలుస్తుందని ఆవిడ చెప్తుంది. అప్పుడే నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. ఈ మెషిన్ ద్వారా వల్లి చెప్పేది అబద్దమో నిజమో తెలుస్తుందని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |